ఆ ఫ్లాట్లు నావి కావు..!!
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:45 AM
మోహన్ నాయక్ డబ్బుతోనే కొనుగోలు చేశామని అతడి మరదలి వాంగ్మూలంరహదారులు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్ బినామీలపై ఏసీబీ అధికారు లు దృష్టి సారించారు.
ఇంటర్నెట్ డెస్క్: మోహన్ నాయక్ డబ్బుతోనే కొనుగోలు చేశామని అతడి మరదలి వాంగ్మూలంరహదారులు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్ బినామీలపై ఏసీబీ అధికారు లు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మోహన్ నాయక్ మరదలు పద్మిని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ ప్రాజెక్టులో తన పేరిట ఉన్న (రూ.2.44 కోట్ల విలువైన) 2 ఫ్లాట్లు మోహన్‌నాయక్ డబ్బుతో కొనుగోలు చేసినవేనని ఆమె ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ఆమె వాంగ్మూలాన్ని అధికారులు మెమో రూపంలో న్యాయస్థానానికి అందజేసినట్లు సమాచారం. జూన్ 9న మోహన్ నాయక్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుచేసిన ఏసీబీ.. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించిన సంగతి తెలిసిందే.