హామీలు అమలు చేయని మోదీ సర్కార్
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:52 PM
యు వత తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాలన రసింహ హెచ్చరించారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ
- నాలుగో రోజు సీపీఐ పాదయాత్ర
పెద్దకొత్తపల్లి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : యు వత తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాలన రసింహ హెచ్చరించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో జరుగుతున్న సీపీఐ పాదయాత్ర ఆది వారం నాల్గవ రోజుకు చేరింది. మారేడుమాను దిన్నె నుంచి కొండ్రావుపల్లికి చేరింది. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ 2014 సం వత్సరంలో తమను అధికారంలోకి తీసుకొస్తే ఏ డాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికా రంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని గాలికొదిలే శారని విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ సంస్థ లను ప్రైవేట్ వారికి అప్పనంగా అమ్మేస్తూ, కు ల, మత ప్రాంతాలుగా విభజన రేఖలు గీస్తూ యువతను దగా చేసిన బీజేపీ ప్రభుత్వానికి రా బోయే కాలంలో యువత తిరగబడి వారికి తగి న బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆ యన హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగిన సంఘటన మరువరాదని, మున్ముందు ఇలాంటి ఉద్యమాలే దేశంలో జ రుగుతాయని ఆయన పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో సీపీఐ జి ల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయా జ్, జిల్లా కార్యవర్గ సభ్యులు త న్నీరు నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుమ్మల శివుడు, బండి లక్ష్మీపతి, కుర్మయ్య, కిరణ్‌కు మా ర్, కందూరి వెంకటమ్మ, జిల్లా చందు, రామకృష్ణ, వెంకటస్వామి, నాయకులు సాయిలు, బండి కృష్ణ య్య, బాలపీరు, పుట్ట కుర్మయ్య, రమణ, బొంద య్య, ప్రకాశ్, గాలెన్న పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
కల్వకుర్తి, (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జి పులిజాల పరశు రాములు కోరారు. సీపీఐ జాతీయ సమితి పి లుపు మేరకు ఆగస్టు 6 నుంచి 14వరకు చేప ట్టిన ప్రజా సమస్యల పరిష్కార ప్రచారయాత్ర ఆదివారం కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎల్లికల్, జంగారెడ్డిపల్లి, తిమ్మరాసి పల్లి, సిలార్‌పల్లి గ్రామాలతో పాటు కల్వకుర్తిలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రజలకు వివ రించి ఉద్యమాల ద్వారానే వాటి పరిష్కారం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు దేశం సైదులు, అమీర్, శేఖర్, కు మార్, పరశురాంగౌడ్, లక్ష్మణ్, రాజేశ్, బాలయ్య, ఖదీర్, నాగరాజు, ధార దాసు, జనార్దన్, రాజు, పురుషోత్తం, యాదగిరి, శివ, శ్రీను, మర్రిపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.