kumaram bheem asifabad- జిల్లాలో మోస్తరు వర్షం
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:23 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం కురిసింది. కెరమెరి మండలంలో 51.8 మిలీమీటర్ల వర్షం కురిసింది. రెబ్బెనలో 49.8, తిర్యాణిలో 31.8 లింగాపూర్‌లో 24.3 , కాగజ్‌నగర్‌లో 22.3 జైనూరులో 15.3, వాంకిడిలో 12.8 ఆసిఫాబాద్‌లో 12.3, సిర్పూర్(యూ)లో 6.8 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆసిఫాబాద్/కెరమెరి/లింగాపూర్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షం కురిసింది. కెరమెరి మండలంలో 51.8 మిలీమీటర్ల వర్షం కురిసింది. రెబ్బెనలో 49.8, తిర్యాణిలో 31.8 లింగాపూర్‌లో 24.3 , కాగజ్‌నగర్‌లో 22.3 జైనూరులో 15.3, వాంకిడిలో 12.8 ఆసిఫాబాద్‌లో 12.3, సిర్పూర్(యూ)లో 6.8 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురిసిన వర్షానికి పత్తిపంటకు ప్రయోజనం చేకూరనుంది. కెరమెరి మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని పత్తి రైతులు, ఆరుతడి పంటలు వేసిన రైతులు దిగాలు పడుతున్నారు. ఈ భారీ వర్షంతో పత్తి పంటకు వచ్చిన మొగ్గ, కాయలు నేలరాలిపోయే అవకాశం ఉందని, దీంతో తాము నష్టపోయే అవకాశాలున్నాయని రైతులు చెబుతున్నారు. లింగాపూర్: మండల వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బారీ వర్షం కురిసింది, మండల కేంద్రానికి చెందిన జాదవ్ గోపిచంద్ అనే రైతు సాగ చేసిన మొక్కజొన్న పంట గాలి తీవ్రతకు నేలకొరిగింది. అధికారులు పంట నష్టం అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు.