Share News

టీపీసీసీ ఓబీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:43 AM

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ( టీపీసీసీ) ఓబీసీ విభాగం చైర్మన్‌గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ నియమితులయ్యారు. కన్వీనర్లుగా డాక్టర్‌ కేతూరి వెంకటేశ్‌, డాక్టర్‌ జూలూరు ధనలక్ష్మిలకు అవకాశం దక్కింది.

టీపీసీసీ ఓబీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

న్యూఢిల్లీ/షాద్‌నగర్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ( టీపీసీసీ) ఓబీసీ విభాగం చైర్మన్‌గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ నియమితులయ్యారు. కన్వీనర్లుగా డాక్టర్‌ కేతూరి వెంకటేశ్‌, డాక్టర్‌ జూలూరు ధనలక్ష్మిలకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి అధిష్ఠానం ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించిందని కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Jan 28 , 2026 | 03:43 AM