అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:01 PM
బెల్లంపల్లి పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ భూమిపూజ చేశారు. మున్సిపాలిటీలోని 20,21,22,23 వార్డులకు సంబంధించిన బూడిదగడ్డ బస్తీ - ఏఎంసీ సమీపంలో రూ. 50 లక్షలతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణపనులను ప్రారంభించారు. అలాగే 29,30,31,32 వార్డుల్లో హనుమాన్ బస్తీ- బాబుక్యాంప్, హనుమాన్‌గుడి సమీపంలో రూ. 45 లక్షలతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీపనులకు శంకుస్ధాపన చేశారు.
బెల్లంపల్లి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : బెల్లంపల్లి పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ భూమిపూజ చేశారు. మున్సిపాలిటీలోని 20,21,22,23 వార్డులకు సంబంధించిన బూడిదగడ్డ బస్తీ - ఏఎంసీ సమీపంలో రూ. 50 లక్షలతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణపనులను ప్రారంభించారు. అలాగే 29,30,31,32 వార్డుల్లో హనుమాన్ బస్తీ- బాబుక్యాంప్, హనుమాన్‌గుడి సమీపంలో రూ. 45 లక్షలతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీపనులకు శంకుస్ధాపన చేశారు. అలాగే హనుమాన్‌బస్తీ గ్రంథాలయం సమీంపలో రూ. 40 లక్షలతో, 3,17,18 వార్డుల్లో రూ. 1.85 కోట్లతో, 15,16 వార్డుల్లో రూ. 20 లక్షలతో చేపట్టనున్న రోడ్లు,డ్రైనేజీల నిర్మాణపనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడఉతూ బెల్లంపల్లి పట్టణాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఉండదని తెలిపారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.