టార్గెట్ ముఖ్యమంత్రి పదవే మంత్రి పదవి ఇవ్వకుంటే లక్ష్యం అదే:రాజగోపాల్
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:17 AM
చేస్తారా.. మంత్రిని చేయండి.. ఇచ్చిన మాటకు కట్టుబడి.. లేదంటే టార్గెట్ నేరుగా ముఖ్యమంత్రి పదవే’’నంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
యాదాద్రి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘‘చేస్తారా.. మంత్రిని చేయండి.. ఇచ్చిన మాటకు కట్టుబడి.. లేదంటే టార్గెట్ నేరుగా ముఖ్యమంత్రి పదవే’’నంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మునిసిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో మాట్లాడారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవి తనకోసం కాదని, ప్రజల కోసమేనన్నారు. ‘దేనికైనా రోజులు వస్తాయి.. తెలంగాణపై జెండా ఎగురవేద్దాం.. మీ అభిమానానికి, ప్రేమకు జన్మజన్మలకు రుణపడి ఉంటా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.