Share News

అట్టహాసంగా ఎమ్మెల్యే కశిరెడ్డి జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:24 PM

కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో ఆదివా రం అట్టహాసంగా జరుపుకు న్నారు.

అట్టహాసంగా ఎమ్మెల్యే కశిరెడ్డి జన్మదిన వేడుకలు
కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో ఆదివా రం అట్టహాసంగా జరుపుకు న్నారు. కాంగ్రెస్‌ పార్టీ నా యకులు, కార్యకర్తలు, ఎ మ్మెల్యే అభిమానులు, అను చరులు పెద్దఎత్తున పూల మాలలు, శాలువాలతో ఎ మ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినభారీ కేకులను ఎమ్మె ల్యే కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కల్వకుర్తి ప ట్టణంలో మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌ కు మార్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ చౌరస్తా లో ఎమ్మెల్యేకు స్వాగతం పలికి పెద్దఎత్తున బా ణసంచా పేల్చి సత్కరించారు. అంతకు ముం దు అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. మహబూబ్‌నగర్‌ చౌరస్తా నుంచి క్యాంపు కార్యాలయం వరకు భారీగా ర్యాలీగా వెళ్లారు. క్యాంపు కార్యాలయంలో భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువు రు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఆయా గ్రామాల్లో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యులు ఠాకూర్‌ బాలాజీసింగ్‌, మాజీసర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మనీలా సంజుకుమార్‌ యాదవ్‌, జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, వె ల్దండ మాజీ సర్పంచ్‌ ఎన్నం భూపతిరెడ్డి, కాం గ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రమా కాంత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ ఎజాస్‌, గోరటి శ్రీ నివాసులు, మాజీ సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 11:24 PM