మిట్టపల్లి సురేందర్‌కు ‘మా భూమి’ పురస్కారం
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:05 AM
ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఈ ఏడాది మాభూమి ప్రజా సాహిత్య పురస్కారానికి గేయ రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్‌ను...
జూలై 12న ప్రదానం
హైదరాబాద్ సిటీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఈ ఏడాది మాభూమి ప్రజా సాహిత్య పురస్కారానికి గేయ రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్‌ను ఎంపిక చేసినట్లు మాభూమి సాహితి సాంస్కృతిక చైతన్య వేదిక సమన్వయకర్త గొర్రెపాటి నరసింహ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల గొంతుకను పద్యంగా, పాటగా, పోరాటంగా మలచిన సాహితీ స్రష్టలను గౌరవించడమే ధ్యేయంగా 2024 నుంచి ప్రతి ఏటా దాశరథి జయంతినాడు అవార్డు ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రజా కవులు గోరటి వెంకన్న, జయరాజ్ ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎల్బీనగర్ వాసవి శ్రీనిలయంలో జూలై 12న అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు.