మైనార్టీ యువత కోసం జాబ్‌మేళాలు: అజారుద్దీన్
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:47 AM
పట్టభద్రులైన మైనార్టీ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు.
పట్టభద్రులైన మైనార్టీ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. నాంపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన యువతకు నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో 80కంపెనీలు పాల్గొని 300కి పైగా మైనార్టీ యువతను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాబ్ మేళాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనికోసం కంపెనీలు సైతం సానుకూలంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు మైనార్టీ యువతకు హైదరాబాద్‌లో జాబ్ మేళాలు నిర్వహించి 4వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.