నాగర్‌కర్నూల్‌లో స్వల్ప ఉద్రిక్తత
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:33 PM
బుధవారం జరిగిన నాగర్‌కర్నూ ల్ మునిసిపాలిటీ ఎన్నికల్లో 14, 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ ఎస్ నాయకులు ఆందోళన చేశారు.
- నాగర్‌కర్నూల్ 14,15 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వివాదం
- దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్‌ఎస్ ఆందోళన
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఆందోళన
- రెండు వార్డుల వద్ద భారీగా పోలీసుల మోహరింపు
కందనూలు/ నాగర్‌కర్నూల్ టౌన్/ కొల్లాపూర్/ కల్వకుర్తి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : బుధవారం జరిగిన నాగర్‌కర్నూ ల్ మునిసిపాలిటీ ఎన్నికల్లో 14, 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ ఎస్ నాయకులు ఆందోళన చేశారు. 15వ వార్డు దగ్గర ఓటు వేయడానికి వచ్చిన మహిళలను అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మైనర్ బాలికలు 40, 45 ఏళ్ల వయస్సు వారి ఆధార్‌కార్డులతో ఓట్లు వేయడానికి వచ్చారని బీఆర్‌ఎస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య వాగ్వీవాదం చోటు చేసుకుం ది. ఓటు వేయడానికి వచ్చిన మహిళలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి పంపించారు. ఈ సంఘటన తెలు సుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పోలింగ్ కేంద్రానికి చేరుకోగా అక్కడే ఉన్న పోలీసులు మర్రి జనార్దన్‌రెడ్డిని పోలిం గ్ కేంద్రంలోకి వెళ్తుండగా అడ్డుకున్నారు. సీఐ అశోక్‌రెడ్డిపై మర్రి జనార్దన్‌రెడ్డి వాగ్వివాదానికి దిగారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మర్రి మండిపడ్డారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి కూడా 15వ వార్డు దగ్గరికి రావ డంతో అక్కడి పరిస్ధితి తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఇతర మం డలాల వ్యక్తులు పోలింగ్ కేంద్రం వద్దకు ఎందుకు వచ్చారని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఇతర ప్రాం తాల నుంచి రాజకీయాలను చేస్తున్న వారిపై చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే పోలీసులకు సూచించారు. 14వ వార్డు దగ్గర మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్య ర్ధి భర్త ఖాజాఖాన్‌ల స్వల్ప వాగ్వివాదం జరిగింది. బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారని మర్రి జనార్దన్‌రెడ్డి వాగ్వివాదా నికి దిగారు. పోలీసుల జోక్యం ఇరువురికి సంయమన పరిచా రు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చల్లబడింది.
గుర్తు తెలియని మహిళలపై కేసు నమోదు
నాగర్‌కర్నూల్ మునిసిపల్ ఎన్నికల్లో బుధవారం 15 వార్డు దగ్గర ఇద్దరు మహిళలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆంజనేయులు నాగర్‌కర్నూల్ పో లీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ గోవర్దన్ బుధవారం తెలిపారు. ఈ సంఘనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీలో 73.98 శాతం పోలింగ్
నాగర్‌కర్నూల్ మునిసిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మునిసిపాలిటీలోని 24 వార్డులకు 49 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 73.98 శాతం పోలింగ్ నమో దైంది. మునిసిపాలిటీలో మొత్తం 35,378 మంది ఓటర్లు ఉండగా అందులో 26,171 మంది ఓ టర్లు తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు.అందులో 13,265 మంది మహిళలు, 12,906 మంది పురుషులు ఓటు వేశారు. కలెక్టర్ బ దావత్ సంతోష్ మునిసిపాలిటీలోని సంతబజారు 14వ వార్డును సంద ర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. సంజయ్‌నగర్ కాలనీ 16వ వార్డులో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తన ఓటు హక్కునువినియోగించుకున్నారు.
కొల్లాపూర్‌లో 80.1 శాతం పోలింగ్
కొల్లాపూర్ మునిసిపల్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. కొ ల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్ స్టేషన్‌లలో 38 పోలింగ్ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ముని సిపాలిటీ పరిధిలో మొత్తం 19,356 మంది ఓటర్లకుగాను 15,505 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోగా, 80.1శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ధ్రువీక రించారు. సీఐ కె.మహేష్ నేతృత్వంలో 166 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కల్వకుర్తిలో 80.80 శాతం పోలింగ్ నమోదు
కల్వకుర్తిలో బుధవారం జరిగిన మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 22 వార్డులకుగాను 44 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగగా, 26,023 ఓట్లకుగాను 21,027 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 80.80 శాతం ఓటింగ్ నమోదైనట్లు మునిసిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి మహ్మద్ షేక్ తెలిపారు. మాజీ మంత్రి చిత్తరంజన్ దాసు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ పర్యవేక్షించారు. హైదరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అడిషనల్ ఎస్పీ బురాన్‌అలీ, డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఐలు నాగార్జున, రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ మాదవరెడ్డిల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు.
అధికార దుర్వినియోగం : మాజీ ఎమ్మెల్యే బీరం
కొల్లాపూర్ మునిసిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్శవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం తొత్తుల వ్యవహరించా రని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం కొల్లాపూర్ మునిసిప ల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు విని యోగించుకున్నారు. అక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా మునిసిపల్ పీఠం బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.