Share News

17న పెద్దపల్లిలో మంత్రుల పర్యటన

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:12 AM

పెద్దపల్లి నియోజక వర్గంలో ఈనెల 17న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు

17న పెద్దపల్లిలో మంత్రుల పర్యటన
గర్రెపల్లి వద్ద పార్టీ నాయకులతో చర్చిస్తున్న ప్రభుత్వ విప్‌విజయరమణారావు

సుల్తానాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి నియోజక వర్గంలో ఈనెల 17న రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాల ఏర్పా ట్లను ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు మంగళవారం సుల్తానాబాద్‌, గర్రెపల్లి గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లోని పలు గ్రామాలను కలుపుతూ రూ.99 కోట్లతో గర్రెపల్లి నుంచి పెగడపల్లి వరకు నిర్మించనున్న తారు రోడ్డుకు గర్రెపల్లిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే రూ.44 కోట్లతో సుల్తానాబాద్‌ నుంచి పెద్దపూర్‌ వరకు నిర్మించనున్న రోడ్డుకు సుల్తానాబాద్‌లో శంకుస్థాపన చేసి అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కాల్వశ్రీరాంపూర్‌, జూలపల్లి మండలాల్లో రోడ్ల అభివృద్ధి, సెంట్రల్‌ లైటింగ్‌ పనులతో పాటు గంగారం నుంచి పందిళ్ల, కూనారం చౌరస్తా నుంచి ముత్తారం వరకు రోడ్లకు సం బంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయని తెలిపా రు. రోడ్ల అభివృద్ధితో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:12 AM