గద్దర్ సతీమణికి భట్టి, పొన్నం పరామర్శ
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:38 AM
గద్దర్ సతీమణి విమలమ్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పరామర్శించారు.
నిమ్ప్, మార్చి 26 ఆంధ్రజ్యోతి): గద్దర్ సతీమణి విమలమ్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పరామర్శించారు. ఆమె ఆర్యోగ పరిస్థితి గురించి నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్పను అడిగి తెలుసుకున్నారు. విమలమ్మ పిత్తాశయంలో రాళ్ల వల్ల కలిగిన వాపుతో ఇబ్బంది పడుతున్నారని, రేడియాలజీ విభాగం ద్వారా పిగ్‌టైల్ క్యాథెటర్ అమర్చినట్టు వైద్యులు పేర్కొన్నారు. వారి వెంట గద్దర్ కుమార్తె సాంస్కృతిక సారథి చైర్మన్ జీవీ వెన్నెల, కుమారుడు సూర్యం ఉన్నారు. విమలమ్మను కుటుంబ సభ్యులు ఈనెల 24న నిమ్స్‌లో చేర్పించారు.