మంత్రి అసహనం
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:32 PM
రె వెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు అ లసత్వం వీడాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాం స్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు.
- సమస్యల పరిష్కారంలో జాప్యంపై మండిపడ్డ జూపల్లి కృష్ణారావు
పెంట్లవెల్లి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : రె వెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు అ లసత్వం వీడాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాం స్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. శనివారం మండల కేంద్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా నియో జక వర్గంలోని వివిధ ప్రాంతాల్లో స్టేడియాల ని ర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని మంత్రి క్షే త్రస్థాయిలో పరిశీలించారు. కొల్లాపూర్ పట్టణం తో పాటు వీపనగండ్ల, పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామం, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో స్టేడియాల నిర్మా ణానికి కసరత్తు కొనసాగుతుం దన్నారు. ఈ ప్రక్రియ వివిధ దశ ల్లో ఉందని అవసరమైన చర్యల ను వేగవంతం చేయాలని అధికా రులను ఆదేశించారు. అనంతరం రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెంట్లవెల్లి మండల కేంద్రంలో ప్రజా సమస్యల పై అధికారులతో మంత్రి రెవెన్యూ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సమస్య ల విషయంలోని ర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్డీవో బన్సీలాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి భూ సమస్యల పరి ష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాల న్నారు. రైతుల సమ స్యలపై మంత్రి జూపల్లి తీవ్రంగా స్పందించారు. ఏళ్ల తరబడి ప్రజలను కార్యాల యాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యా లయాలకు వస్తే సత్వరం పరిష్కరించా ల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవె న్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఆదే శించారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్య క్షుడు గోపీనాయక్, కొండూరు సర్పంచు కేతూరి ధర్మతేజ, నాయకులు రామన్‌గౌడ్, నరసింహ యాదవ్, కబీర్, ఆసిఫ్, కుమార్, రవి, నాగరాజు, నరేష్ పాల్గొన్నారు. þ