Share News

సామాజిక సేవలతో మంత్రి జన్మదినం

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:23 PM

రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలను కొల్లాపూర్‌లో ఘనంగా నిర్వహించారు.

సామాజిక సేవలతో మంత్రి జన్మదినం
మంత్రి జూపల్లి జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి తినిపిస్తున్న మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ రెడ్డి జ్యోతి, నాయకులు

- జూపల్లి కృష్ణారావు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

- మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి జ్యోతి, నాయకుల ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌

కొల్లాపూర్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలను కొల్లాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో, అభిమానులు, ప్రజాప్రతినిధు లు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహభరిత వాతా వరణంలో నిర్వహించారు. మాధవస్వామి దే వాలయంలో మంత్రి పేరిట ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణం లోని ప్రధాన కూడళ్లను కలుపుతూ కాంగ్రెస్‌ కా ర్యకర్తలు, నాయకులు భారీర్యాలీ నిర్వహించా రు. అంబేడ్కర్‌ విగ్రహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాలమూరు బ్లడ్‌ సెంటర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్ర భుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సంయుక్తంగా భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 110 మంది కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు, యువకులు, కార్యకర్త లు రక్తాన్నిదానం చేశారు. విశ్వ శాంతి వెల్ఫేర్‌ సొసైటీ వృద్ధాశ్ర మంలో వృద్ధులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పండ్లు, బ్రెడ్లు అందజేశారు. వేడుకల్లో కొ ల్లాపూర్‌ మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ రెడ్డి జ్యోతి, వైస్‌ చైర్మన్‌ షేక్‌ రహీంపాషా, నా యకులు రంగినేని జగదీశ్వరుడు, సత్యం, రాము యాదవ్‌, కాంగ్రెస్‌ మం డల అధ్యక్షుడు బాలరాజు, కొల్లాపూర్‌ పట్టణ అధ్యక్షుడు పెబ్బేటి శేఖర్‌, వివిధ వార్డుల ము నిసిపల్‌ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు అధి క సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు నాయకత్వంలో కొల్లాపూర్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని, ఆయన ప్రజా సేవలో ముందంజలో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. ఇందిరాగాంధీ అభి మాన సంఘం అధ్యక్షుడు, డీసీసీ ఉపాధ్యక్షుడు రంగినేని జగదీశ్వరుడు ఆధ్వర్యంలోనూ మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి.

Updated Date - Aug 10 , 2026 | 11:23 PM