కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో.. 12న చలో ఢిల్లీ
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:14 AM
కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న వందలాది డప్పు కళాకారులతో మహాధర్నా చేసేందుకు...
పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి వివేక్
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న వందలాది డప్పు కళాకారులతో మహాధర్నా చేసేందుకు ‘చలో ఢిల్లీ’కి కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ సచివాలయంలో కార్మికశాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా ‘చలో ఢిల్లీ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల సాధనకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాస్తానని మంత్రి హామీనిచ్చినట్లు పరశురామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.