Share News

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:20 AM

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

  • ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయాలి: వివేక్‌

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ తవ్వకాలను నిరోధించడానికి నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) అధికారులతో సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక లభ్యత, ఇసుక తవ్వకాలు, ఆదాయ పరిస్థితి, ఆదాయ వృద్ధి అవకాశాలు, నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, చేపట్టాల్సిన సంస్కరణలపై సమగ్రంగా సమీక్షించారు. ఆదాయ వృద్ధి, పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం, అక్రమ మైనింగ్‌ నియంత్రణకు చేపడుతున్న చర్యలను టీజీఎండీసీ డైరెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి మంత్రికి వివరించారు. ఖనిజాల అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రాధాన్య అంశాలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని మంత్రి గనుల శాఖ అధికారులను ఆదేశించారు.

Updated Date - Jun 07 , 2026 | 06:20 AM