Share News

క్రీడల అభివృద్ధికి రేవంత్‌ కృషి: మంత్రి వాకిటి

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:00 AM

క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ...

క్రీడల అభివృద్ధికి రేవంత్‌ కృషి: మంత్రి వాకిటి

  • గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్‌ పోటీలు ప్రారంభం

గచ్చిబౌలి/ఖమ్మం స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి క్రీడల ప్రారంభోత్సవానికి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రాణించి ఫైనల్‌కు ఎంపికైన వారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. జనవరి 7 నుంచి 17 వరకు 12,600 గ్రామాల్లో క్రీడా జ్యోతి ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. అనంతరం గ్రామ స్థాయి నుంచి వివిధ పోటీలను నిర్వహించామని చెప్పారు. అలా 5,400 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని స్పష్టం చేశారు. వారికి మంచి శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తామని శ్రీహరి తెలిపారు. కాగా, సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి ఆర్చరీ క్రీడలు ఖమ్మంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ పోటీలను నగర పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ ప్రారంభించారు.

Updated Date - Feb 21 , 2026 | 03:00 AM