Share News

యూరియా కష్టాలు తీర్చాం: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:36 AM

ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులు గత యాసంగి కంటే 30 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను అధికంగా కొనుగోలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

యూరియా కష్టాలు తీర్చాం: మంత్రి తుమ్మల

ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులు గత యాసంగి కంటే 30 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను అధికంగా కొనుగోలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత యాసంగిలో 10.24 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేస్తే... ఈ యాసంగిలో మార్చి 18 నాటికి 10.73 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసినట్లు వివరించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 10.60 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను రాష్ట్రానికి తీసుకొచ్చి రైతులకు ఇచ్చినట్లు వెల్లడించారు. రైతులు క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి రాకూడదనే యూరియా యాప్‌ తెచ్చామని అన్నారు. దేశంలో ఈ తరహా విధానం అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు.

Updated Date - Mar 19 , 2026 | 04:36 AM