లెజిస్లేచరీ నమూనాలో ఇస్తేనే పిటిషన్లను స్వీకరిస్తాం: శ్రీధర్‌బాబు
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:20 AM
శాసనమండలి సభ్యులు తమ పిటిషన్లను లెజిస్లేచరీ నమూనాలో ఇస్తేనే వాటిని స్వీకరిస్తామని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): శాసనమండలి సభ్యులు తమ పిటిషన్లను లెజిస్లేచరీ నమూనాలో ఇస్తేనే వాటిని స్వీకరిస్తామని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన పిటిషన్స్ కమిటీ తొలి సమావేశంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కమిటీ చైర్మన్ బండా ప్రకాశ్, సభ్యులు దాసోజు శ్రావణ్, రెహ్మత్ బేగ్, దామోదర్ రెడ్డి, కోదండరాం, మండలి, శాసనసభ కార్యదర్శులు నరసింహాచార్యులు, తిరుపతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న అన్ని కమిటీలనూ నియమించుకున్నామని చెప్పారు. లెజిస్లేచర్ కమిటీల్లో చోటు దక్కడం అదృష్టంగా భావించాలన్నారు. గుత్తా మాట్లాడుతూ.. పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక లాంటిదన్నారు.