Share News

దివ్యాంగురాలికి మంత్రి శ్రీధర్‌బాబు భరోసా

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:10 AM

ఇంటర్‌ ఫలితాల్లో 786 మార్కులు సాధించిన రంగారెడ్డి జిల్లాకు చెందిన దివ్యాంగురాలు పవిత్రను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అభినందించారు.

దివ్యాంగురాలికి మంత్రి శ్రీధర్‌బాబు భరోసా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో 786 మార్కులు సాధించిన రంగారెడ్డి జిల్లాకు చెందిన దివ్యాంగురాలు పవిత్రను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అభినందించారు. మోకాళ్లపై కూర్చుని స్కాలర్‌షిప్‌ పత్రాన్ని అందించారు. ఆమె కుటుంబ నేపథ్యం, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇకపై చదువుకు సంబంధించి ఆర్థికంగా ఏ అవసరమొచ్చినా తనను సంప్రదించాలన్నారు. పవిత్ర అవసరాలు అడిగి తెలుసుకోవాలని తన వ్యక్తిగత సిబ్బందికి సూచించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మలబార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహించిన స్కాలర్‌షిప్‌ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ర్తీ విద్యను ప్రోత్సహించి, అమ్మాయిని చదివిస్తే, ప్రయోజకురాలై కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. విద్యార్థులు డబ్బుల్లేకనో, మరే కారణం చేతనో చదువును ఆపేయ వద్దన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 04:10 AM