రూ. 200 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు: మంత్రి సీతక్క
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:20 AM
హైదరాబాద్‌కు వచ్చే మహిళలు, యువతుల సౌకర్యార్థం రూ.200 కోట్ల వ్యయంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మించనున్నట్లు మంత్రి ధనసరి అనసూయ...
బోరబండ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌కు వచ్చే మహిళలు, యువతుల సౌకర్యార్థం రూ.200 కోట్ల వ్యయంతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మించనున్నట్లు మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) వెల్లడించారు. ఎస్పీఆర్ హిల్స్ క్రీడా ప్రాంగణంలో రూ.40 కోట్లతో చేపట్టే రెండు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణ పనులకు జూబ్లీహిల్స్ ఎమ్మె ల్యే వి.నవీన్ యాదవ్, అధికారులతో కలిసి మంగళవారం ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాకు నాలుగు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు మంజూరైనట్లు చెప్పారు.