Share News

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:59 AM

మహిళా సాధికారతతోనే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి

  • గివ్‌ టూ గెయిన్‌ స్ఫూర్తితో ముందుకెళ్దాం: సీతక్క

ఇంటర్నెట్ డెస్క్: మహిళా సాధికారతతోనే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఆమె ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పట్టుదల, ప్రతిభను గౌరవించుకోవాల్సిన రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు. గివ్‌ టూ గెయిన్‌ (ఇవ్వడం ద్వారా లాభాన్ని పొందడం) అనే అంశాన్ని మంత్రి సీతక్క ప్రత్యేకంగా ప్రస్థావిస్తూ.. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే.. కుటుంబం ఎదుగుతుందని, దీని ద్వారా సమాజం, దేశం బలపడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంటోందని ఆమె వివరించారు.

Updated Date - Mar 08 , 2026 | 06:01 AM