Share News

మహిళలకు మరిన్ని పథకాలు: సీతక్క

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:38 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురానున్నట్లు...

మహిళలకు మరిన్ని పథకాలు: సీతక్క

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళల భద్రతపై సోమవారం ఆమె సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళా భద్రత కేవలం చట్టపరమైన అంశం కాదని.. మౌలికవసతులు, సాంకేతికత, బాధ్యతాయుత పరిపాలనల కలయికతోనే అది సాధ్యమవుతుందని అన్నారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రయాణించే మహిళా ఉద్యోగులకు జీపీఎస్‌ అనుసంధానిత సురక్షిత రవాణా విధానం ఉండాలన్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్‌ ప్రొఫైల్స్‌ సిద్ధం చేయాలని వెల్లడించారు.

Updated Date - Mar 03 , 2026 | 03:38 AM