మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం: సీతక్క
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:21 AM
మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ..
హైదరాబాద్, జూన్ 10 (ఆంద్రజ్యోతి): మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో బుధవారం మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవల్‌పమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 3,000 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికెట్ల అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలకు మేలు చేస్తుంటే కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.