Share News

మే నెలలో మూడున్నర కోట్ల పనిదినాలు కల్పించాలి

ABN , Publish Date - May 02 , 2026 | 05:17 AM

గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి సీతక్క అన్నారు.

మే నెలలో మూడున్నర కోట్ల పనిదినాలు కల్పించాలి

  • ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి సీతక్క అన్నారు. మే నెల ఉపాధి హామీ పథకం అమలులో అత్యంత కీలకమన్నారు. ఈ నెలలో కనీసం మూడున్నర కోట్ల పనిదినాలను కల్పించడమే లక్ష్యంగా కృషి చేయాలని సిబ్బందికి నిర్దేశించారు. శుక్రవారం ఆమె ములుగు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో స్పెషల్‌ సీఎస్‌ దాన కిషోర్‌, కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌, డీఆర్డీఓలు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి కోరిన ప్రతి కుటుంబానికి పని కల్పించాలన్నారు. ఏప్రిల్‌లో అధికారులు యజ్ఞంలా పనిచేసి కోటిన్నర పనిదినాలను పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పని ప్రాంతాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స లాంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు.

Updated Date - May 02 , 2026 | 05:17 AM