Share News

మేడారంలో గాయపడిన బాలుడి తల్లికి ఉద్యోగం

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:10 AM

మేడారం దేవస్థానంలో రాతి శిల పడి కాలు కోల్పోయిన చిన్నారి యూవిన్‌ (విక్కి) కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. బాలుడు తల్లి సిద్దబోయిన స్వప్నకు దేవస్థానంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశం కల్పించింది.

మేడారంలో గాయపడిన బాలుడి తల్లికి ఉద్యోగం

  • నియామక పత్రం అందించిన మంత్రి సీతక్క

తాడ్వాయి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మేడారం దేవస్థానంలో రాతి శిల పడి కాలు కోల్పోయిన చిన్నారి యూవిన్‌ (విక్కి) కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. బాలుడు తల్లి సిద్దబోయిన స్వప్నకు దేవస్థానంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం ములుగు కలెక్టరేట్‌లో స్వప్నకు మంత్రి సీతక్క నియామక పత్రాన్ని అందించారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్చి 25న వనదేవతల ప్రాంగణంలో విక్కి ఆడుకుంటూ సమ్మక్క గద్దె చుట్టూ ఉన్న రాతి రెయిలింగ్‌ ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. అదే సమయంలో జారిన రాతి శిల చిన్నారి కాలుపై పడింది. దీంతో నుజ్జు నుజ్జు అయిన కాలును వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు.

Updated Date - Apr 19 , 2026 | 06:10 AM