Share News

మహిళలను కోటీశ్వరులను చేసేందుకు మరో అడుగు: మంత్రి సీతక్క

ABN , Publish Date - May 30 , 2026 | 03:38 AM

మహిళల చేతుల్లో బ్యాంక్‌ పాస్‌బుక్స్‌ మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

మహిళలను కోటీశ్వరులను చేసేందుకు మరో అడుగు: మంత్రి సీతక్క

  • ప్రత్యేక ఇంక్యుబేటర్‌ కేంద్రాల ప్రారంభం

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): మహిళల చేతుల్లో బ్యాంక్‌ పాస్‌బుక్స్‌ మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, వారి వ్యాపార కలలను సాకారం చేేసందుకు బలమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపార పరమైన సహకారం అందించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ఇంక్యుబేటర్‌ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బంజారాహిల్స్‌లోని కొమరం భీం ఆదివాసీ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొంతంగా పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదగాలన్నదే తమ సంకల్పమన్నారు. బిట్స్‌ పిలానీతో పాటు ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫామ్‌ టీ-హబ్‌ భాగస్వామ్యంతో రూ.21.40 కోట్లతో రెండు ప్రత్యేక ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటి ద్వారా ప్రాథమిక దశలో 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి, వారికి అంతర్జాతీయ స్థాయిలో ట్రైనింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, డిజిటల్‌ సపోర్ట్‌తో పాటు ఫైనాన్షియల్‌ గైడెన్స్‌, బిజినెస్‌ మెంటారింగ్‌ ేసవలను అందించనున్నట్లు వివరించారు.

Updated Date - May 30 , 2026 | 03:38 AM