సీబీవోలకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చిన మంత్రి సీతక్క
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:46 AM
ఆర్థిక లావాదేవీల్లో పార దర్శకత, ఆర్థిక క్రమశిక్షణే మహిళా స్వయం సహాయక బృందాల అభ్యున్నతికి కీలకమని పంచాయతీరాజ్..
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక లావాదేవీల్లో పార దర్శకత, ఆర్థిక క్రమశిక్షణే మహిళా స్వయం సహాయక బృందాల అభ్యున్నతికి కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం బీఆర్కే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌హెచ్‌జీల ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సీబీవో (కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజర్లు) ఆడిటర్లకు ల్యాప్‌టా్‌పలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ మహిళా సంఘాల ఆర్థిక వ్యవస్థను బాధ్యతాయుతంగా నడిపించడంలో సీబీవో ఆడిటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారి పనిని మరింత సమర్థంగా నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘాలు(ఎస్‌హెచ్‌జీ), వీవోలు,మండల సమాఖ్యల్లో ఆర్థిక పారదర్శకతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు.