మేడారం అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ ఇక్కడ.!!
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:12 AM
మేడారం అంటే నేషనల్ అనుకుంటివా..? ఇంటర్నేషనల్ ఇక్కడ.!!’’ అంటూ మంత్రి సీతక్క ఇన్‌స్టాలో చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘మేడారం అంటే నేషనల్ అనుకుంటివా..? ఇంటర్నేషనల్ ఇక్కడ.!!’’ అంటూ మంత్రి సీతక్క ఇన్‌స్టాలో చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు న్యూజిలాండ్ నుంచి మావోరి తెగకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి ఇక్కడ వారి ఆచారం ప్రకారం నృత్యం చేశారు. అంతకుముందు వనదేవతలను దర్శించుకున్నారు. మావోరి తెగ వారందరికీ మంత్రి సీతక్క స్వయంగా బొట్టు పెట్టి ఆహ్వానించారు. మావోరి తెగ ప్రతినిధులు తల్లులను దర్శించుకుంటున్న సమయంలో తీసిన ఓ వీడియోను, వారు నృత్యం చేస్తున్న వీడియోను కలిపి సీతక్క ఇన్‌స్టాలో పోస్టు చేశారు.