Share News

పొలిమేర కూడా దాటనియ్య

ABN , Publish Date - Feb 08 , 2026 | 07:20 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా మండిపడ్డారు.

పొలిమేర కూడా దాటనియ్య

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లికి మంత్రి పొన్నం సవాల్‌

హుస్నాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఈ ఊరి ముఖం తెల్వని వాడు ఇక్కడికొచ్చి మాట్లడుతున్నడు.. స్థానిక ఎమ్మెల్యేను పట్టుకుని రారా.. పోరా అంటున్నడు.. బిడ్డా.. పొలిమేర కూడా దాటనివ్వను’ అని తక్కళ్లపల్లిని పొన్నం హెచ్చరించారు. కాంగ్రెస్‌ వాళ్లు ఏం చేయడం లేదని హుస్నాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో తక్కళ్లపల్లి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం పై విధంగా స్పందించారు. హుస్నాబాద్‌ మునిసిపాలిటీలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ‘నేను భయపడే వ్యక్తిని కాదు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో కొట్లాడి వచ్చిన వ్యక్తిని’ అని పేర్కొన్నారు. దమ్ముంటే హుస్నాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు రావాలని తక్కళ్లపల్లికి సవాల్‌ విసిరారు.

Updated Date - Feb 08 , 2026 | 07:21 AM