మరింత ఉత్సాహంగా పనిచేస్తాం: పొన్నం
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:16 AM
మునిసిపల్ ఎన్నికల్లో 90 శాతానికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో మరింత బాధ్యతగా రెట్టింపు ఉత్సహంతో పని చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హుస్నాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో 90 శాతానికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో మరింత బాధ్యతగా రెట్టింపు ఉత్సహంతో పని చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ మునిసిపల్‌లో 16 వార్డులు కాంగ్రెస్ గెలిచిందని, ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. .
గాంధీభవన్‌లో సంబరాలు
మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.