Share News

ఆర్టీసీ కార్మికులు నిరసనలు విరమించుకోవాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:12 AM

సమస్యల పరిష్కారం పేరుతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం...

ఆర్టీసీ కార్మికులు నిరసనలు విరమించుకోవాలి

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం పేరుతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 24న కార్మిక సంఘాలు ఛలో సచివాలయానికి పిలుపునివ్వడంతో ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్‌ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి కోరారు. తమ ప్రభుత్వం 3,038 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిందని, ప్రస్తుతం 2 వేల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరుగుతుందని, త్వరలో మరో వెయ్యి మంది డ్రైవర్ల నియామకం జరగనుందన్నారు. పెండింగ్‌లో ఉన్న 1132 కారుణ్య నియామకాలు చేపట్టామని చెప్పారు.

Updated Date - Feb 24 , 2026 | 05:12 AM