కేంద్రం విధానాల వల్లే గ్యాస్ కొరత: పొన్నం
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:25 AM
రష్యా, ఉక్రెయిన్ యద్ధాన్ని ఆపాలంటూ గతంలో చెప్పిన మోదీ ప్రభుత్వం.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం విషయంలో ఎందుకు మాట్లాడట్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రష్యా, ఉక్రెయిన్ యద్ధాన్ని ఆపాలంటూ గతంలో చెప్పిన మోదీ ప్రభుత్వం.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం విషయంలో ఎందుకు మాట్లాడట్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుత గ్యాస్ కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ఈ సంక్షోభం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండగా, సామాన్యులు గ్యాస్ బుకింగ్స్, డెలివరీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వంట కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.