‘మీ సేవ’ యాప్‌లో ఆర్టీసీ టికెట్లు
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:24 AM
మీ సేవ మొబైల్ యాప్’ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు, పాసులు పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సచివాలయంలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్..
ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘మీ సేవ మొబైల్ యాప్’ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు, పాసులు పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సచివాలయంలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్.. రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఎండీ నాగిరెడ్డితో కలిసి ఈ నూతన సేవలను ఆవిష్కరించారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగానే ‘మీ టికెట్’ సదుపాయాన్ని కల్పించామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ వరకు అన్ని సర్వీసుల్లోనూ ఈ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందిలేని రవాణా సౌకర్యం కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి అన్నారు.