రాష్ట్రాభివృద్ధి కోసం నిధులను తీసుకురండి
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:05 AM
రాజకీయాలు, రాష్ట్రాభివృద్ధి వేర్వేరు అంశాలని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకురావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌ను ...
కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
హైదరాబాద్, మార్చి10(ఆంధ్రజ్యోతి): రాజకీయాలు, రాష్ట్రాభివృద్ధి వేర్వేరు అంశాలని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకురావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రస్తావించాలని సూచించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంగళవారం పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఖర్చయ్యే దానిలో సగం నిధులు ఇవ్వాలని, మూసీ ప్రాజెక్టుకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు.