Share News

‘రెవెన్యూ’ సమస్యలుంటే రేపు గాంధీభవన్‌కు రండి

ABN , Publish Date - Jul 21 , 2026 | 04:18 AM

రెవెన్యూ శాఖ పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పేద, మధ్య తరగతి ప్రజలు బుధవారం గాంధీభవన్‌కు వచ్చి ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవాలని టీపీసీసీ సూచించింది.

‘రెవెన్యూ’ సమస్యలుంటే రేపు గాంధీభవన్‌కు రండి

  • ముఖాముఖిలో మంత్రి పొంగులేటిని కలవండి: టీపీసీసీ

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖ పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పేద, మధ్య తరగతి ప్రజలు బుధవారం గాంధీభవన్‌కు వచ్చి ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవాలని టీపీసీసీ సూచించింది. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్‌లో ఆయన ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకుని రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఇన్‌చార్జ్‌ సంగిశెట్టి జగదీశ్వర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం మంత్రి పొంగులేటి.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినతిపత్రాలను స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

Updated Date - Jul 21 , 2026 | 04:19 AM