Share News

కళ్లల్లో విషం నింపుకొన్న ప్రతిపక్షాలు

ABN , Publish Date - May 04 , 2026 | 04:48 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాలను చూడలేక.. ప్రతిపక్షాలు కళ్లల్లో విషం నింపుకొని తమపై అసత్య ప్రచారం చేస్తున్నాయని రెవెన్యూ మంత్రి...

కళ్లల్లో విషం నింపుకొన్న ప్రతిపక్షాలు

  • అభివృద్ధిని చూడలేక సర్కారుపై తప్పుడు ప్రచారం

  • రైతులకు బీఆర్‌ఎస్‌ సంకెళ్లు వేస్తే.. మేం రాజుల్ని చేశాం

  • 5,6,7 తేదీల్లో వరంగల్‌లో రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ

  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, కూసుమంచి/తిరుమలాయపాలెం, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాలను చూడలేక.. ప్రతిపక్షాలు కళ్లల్లో విషం నింపుకొని తమపై అసత్య ప్రచారం చేస్తున్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్దతు ధర లు కోరిన రైతులకు ఖమ్మంలో బేడీలు వేసి అవమానించిన చరిత్ర బీఆర్‌ఎ్‌సది అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతును రాజును చేశామన్నారు. కాగా ఈనెల 5, 6, 7 తేదీల్లో వరంగల్‌లో నిర్వహించే రైతు వారోత్సవాల్లో రైతులకు సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి ఉన్నతపాఠశాల ప్రాంగణంలో, అలాగే తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్తో కలిసి మంత్రి ప్రజాదర్బార్‌లలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో పొంగులేటి మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రైతు సంక్షేమంలో కేసీఆర్‌ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తాము చేతల్లో చూపిస్తున్నామన్నారు. వడ్లు, మొక్కజొన్న పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం, సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌ అందించడం, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం.. రైతు పక్షపాత చర్యలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు కమిషన్‌ ఏర్పాటుచేయడం గొప్ప నిర్ణయమని మంత్రి అన్నారు. కాగా ప్రజాదర్బార్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరుకు లేదా వచ్చేనెల రెండో విడతలో అర్హులందరికీ మంజూరు చేస్తామన్నారు. కాగా బచ్చోడులో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా వర్షం కురవడంతో సభా ప్రాంగణమంతా తడిసిపోయింది. దీంతో పొం గులేటి సుమారు గంట సేపు పాఠశాల గదినే వేదికగా చేసుకున్నారు. కరెంట్‌ పోవడంతో.. టార్చ్‌లైటు వెలుగులో ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించారు.

Updated Date - May 04 , 2026 | 04:48 AM