Share News

కమీషన్లు తప్ప పేదోడి గూడు పట్టని కేసీఆర్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:19 AM

గత పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌.. కమీషన్లు వచ్చే పనులు తప్పా.. ఏనాడూ పేదవాడికి గూడు కట్టాలన్న ఆలోచన చేయలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి ..

కమీషన్లు తప్ప పేదోడి గూడు పట్టని కేసీఆర్‌

  • మంత్రి పొంగులేటి ఎద్దేవా

పరకాల టౌన్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌.. కమీషన్లు వచ్చే పనులు తప్పా.. ఏనాడూ పేదవాడికి గూడు కట్టాలన్న ఆలోచన చేయలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. హనుమకొండ జిల్లా పరకాల మునిసిపాలిటీలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఒక్క ఏడాదిలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వానికే దక్కిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న మాట గుర్తుంచుకోవాలని ప్రజలకు హితవు చెప్పారు.

Updated Date - Feb 09 , 2026 | 02:19 AM