Minister Komatireddy: కేసీఆర్ నోరు.. యమునా నది కంటే కంపు
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:27 AM
కేసీఆర్ నోరు.. ఢిల్లీ వద్ద ఉన్న యమునా నది కంటే కంపు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నోరు మూసీ కంటే కంపు అని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి....
ఆయన మాట్లాడే బూతుల గురించి అందరికీ తెలుసు
కేసీఆర్‌ను ఉరేయాలంటే కవిత రక్తం మరిగిందట..కేటీఆర్, హరీశ్‌ను ఉరేసినా తప్పు లేదా?: కోమటిరెడ్డి
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ నోరు.. ఢిల్లీ వద్ద ఉన్న యమునా నది కంటే కంపు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నోరు మూసీ కంటే కంపు అని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందిస్తూ తెలంగాణ సీఎం హోదాలో ఉండి కేసీఆర్ ఎన్ని బూతులు మాట్లాడేవాడో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే, ఎమ్మెల్సీ కవితపైనా కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. ‘‘ కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే... ఊరూరా తిరుగుతున్నావు. కేసీఆర్‌ను ఉరి తీసినా తప్పు లేదన్న వ్యాఖ్యల పట్ల నీ రక్తం మరిగిపోయిందని అంటున్నావు. అంటే... కేటీఆర్, హరీశ్‌రావును ఉరి తీసినా తప్పు లేదా?’’ అని దెప్పిపొడిచారు. ఈ విషయంలో ఆమె గందరగోళానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి కేసీఆర్ రోజూ వస్తే బీఆర్‌ఎస్ పుంజుకుంటుందని మాట్లాడడం చూస్తే..కవిత బీఆర్‌ఎ్‌సలోనే ఉందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. ఆమె ‘పాలమూరు’ విషయంలో బీఆర్‌ఎస్ తప్పు చేసిందని కవిత ఒప్పుకొంటున్నారని, అదే తీరులో బీఆర్‌ఎస్ హయాంలో నల్లగొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయంపై ఆమె ప్రశ్నించాలన్నారు. తాను మంత్రి పదవి కోసం ఏనాడూ పాకులాడలేదని, ఉద్యమ సమయంలో పదవిని త్యాగం చేశానని గుర్తు చేశారు. తనకు సీఎం అంటే గౌరవమని, ఆయన్ను ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తానని స్పష్టం చేశారు. తనకు, తన తమ్ముడికి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు.