ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:15 AM
మ్మడి నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని ప్రజలు మరోసారి మునిసిపల్ ఎన్నికల ద్వారా నిరూపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉమ్మడి...
బీఆర్‌ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని ప్రజలు మరోసారి మునిసిపల్ ఎన్నికల ద్వారా నిరూపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి తామంతా ఐక్యంగా కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరంపర కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఓటమిని అంగీకరించాలని, ఇప్పటికైనా ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.