Share News

బాగా చదువుకో.. అండగా ఉంటా భవితకు మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సాయం

ABN , Publish Date - May 31 , 2026 | 05:57 AM

పదో తరగతిలో 582 మార్కులు, పాలిసెట్‌లో 634వ ర్యాంకు సాఽధించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భవిత అనే విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి....

బాగా చదువుకో.. అండగా ఉంటా భవితకు మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సాయం

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో 582 మార్కులు, పాలిసెట్‌లో 634వ ర్యాంకు సాఽధించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న భవిత అనే విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. ఉన్నత చదువులకు అవసరమైన స్కూల్‌ సర్టిఫికెట్లకు ఇవ్వాల్సిన రూ.60 వేల ఫీజును చెల్లించడంతో పాటు.. విద్యార్థిని తక్షణ ఖర్చుల కోసం మరో రూ.20 వేలను అందజేశారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత చదువులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన మంత్రి.. బాగా చదువుకోవాలని భవితకు సూచించారు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి పాసై స్కూల్‌ టాపర్‌గా నిలిచిన భవితకు స్కూల్‌ నుంచి సర్టిఫికెట్లు తీసుకునేందుకు కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో.. అదే విషయాన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టును చూసిన మంత్రి వెంకటరెడ్డి వెంటనే తన సిబ్బందికి విషయం చెప్పి విద్యార్థిని భవితను బంజారాహిల్స్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడడంతో పాటు స్కూలు ఫీజు చెల్లించారు.

Updated Date - May 31 , 2026 | 05:57 AM