ఆర్ అండ్ బీ లేఖలో ‘ఆంధ్రప్రదేశ్’ పేరు
ABN , Publish Date - May 19 , 2026 | 05:16 AM
రోడ్లు-భవనాల శాఖలోని భవనాల విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ ఆదివారం ఒక వార్తకు సంబంధించి ఖండన లేఖను విడుదల చేశారు.
సంబంధిత అధికారిపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
వివరణ ఇవ్వాలని ఆదేశం.. సోషల్‌మీడియాలో విమర్శలు
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): రోడ్లు-భవనాల శాఖలోని భవనాల విభాగానికి చెందిన చీఫ్ ఇంజినీర్ ఆదివారం ఒక వార్తకు సంబంధించి ఖండన లేఖను విడుదల చేశారు. అందులో ‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ అని ఉండాల్సిన స్థానంలో ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే పేరు ఉండడం చర్చకు దారితీసింది. సంబంధిత అధికారిపై శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని అధికారిని ఆదేశించినట్టు తెలిసింది. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించినట్టు సమాచారం. మంత్రి ఆగ్రహంతో ఆ విభాగం.. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరుతో మరో లేఖ విడుదల చేసింది. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లవుతున్నా అధికారులు మాత్రం తెలంగాణను గుర్తించడంలేదన్న చర్చ జరిగింది.