రాష్ట్రాన్ని గాలికొదిలేసి దృష్టంతా సిద్దిపేటపైనే
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:39 AM
గత దశాబ్దకాలం పాటు రాష్ట్ర మంత్రిగా కొనసాగిన హరీశ్‌రావు సిద్దిపేటపైనే దృష్టి పెట్టి మిగతా రాష్ట్రాన్ని గాలికొదిలేశారని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.
అక్కడి రోడ్లు అభివృద్ధి చేసి బిల్లులన్నీ ఆపేశారు
హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు
గత దశాబ్దకాలం పాటు రాష్ట్ర మంత్రిగా కొనసాగిన హరీశ్‌రావు సిద్దిపేటపైనే దృష్టి పెట్టి మిగతా రాష్ట్రాన్ని గాలికొదిలేశారని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. పనులన్నీ కేవలం సిద్దిపేటలోనే చేపట్టారని అక్కడి రోడ్లను అభివృద్ధి చేసి, భవనాలను నిర్మించి వాటన్నింటికీ పేమెంట్లు చేయకుండా పెండింగ్‌లో పెట్టారన్నారు. ప్రస్తుతం ఆ బిల్లులన్నింటికీ తాము చెల్లింపులు చేయాల్సివస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేటలో డబుల్ రోడ్లు ఉంటే జనగామలో మట్టి రోడ్లే గతన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ విధానం(హ్యామ్)లో రోడ్లు భవనాల శాఖ పరిధిలో రూ.15 వేల కోట్లతో, పంచాయతీరాజ్‌లో రూ.13వేల కోట్లతో రోడ్ల అభవృద్ధికి టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. 2028 ఏప్రిల్ కల్లా దేశంలోనే గొప్పగా తెలంగాణ రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు.