Share News

ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లకు వారంలో బదిలీలు: జూపల్లి

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:49 AM

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,500 మంది ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను వారం రోజుల్లోగా బదిలీ చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. కానిస్టేబుళ్ల బదిలీల...

ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లకు వారంలో బదిలీలు: జూపల్లి

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,500 మంది ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను వారం రోజుల్లోగా బదిలీ చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. కానిస్టేబుళ్ల బదిలీల అనంతరం ఇతర హోదాల్లోని అధికారుల బదిలీలను కూడా దశలవారీగా చేపడతామని స్పష్టం చేశారు. ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. కాగా, విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎక్సైజ్‌శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్‌ ముందుకురావడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. వారు సేకరించిన రూ.2.80 లక్షల విరాళాన్ని మంత్రి జూపల్లి చేతుల మీదుగా సౌమ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇప్పటికే సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయంతో పాటు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని మంత్రి గుర్తు చేశారు.

రూ.2,500 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇండెంట్‌ పెట్టింది. 20 ఏళ్ల కాల పరిమితితో రూ.1,000 కోట్లు, 26 ఏళ్ల పరిమితితో రూ.500 కోట్లు, 29 ఏళ్ల గడువుతో రూ.1,000 కోట్ల రుణాలు సేకరించనున్నది. మార్చి రెండో తేదీన జరిగే ఈ-వేలంలో పాల్గొని ఈ రుణాన్ని తీసుకోనున్నది. తెలంగాణతోపాటు దేశంలోని 13 రాష్ట్రాలు రూ.43,130 కోట్ల రుణాల కోసం ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టాయి.

Updated Date - Feb 28 , 2026 | 03:49 AM