Share News

తైక్వాండో క్రీడాకారులకు మంత్రి సన్మానం

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:28 PM

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి లో ఈనెల 8, 9, 10వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో కొల్లాపూర్‌ మండలానికి చెందిన తైక్వాండో కింగ్స్‌ క్లబ్‌ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.

తైక్వాండో క్రీడాకారులకు మంత్రి సన్మానం
క్రీడాకారులను సన్మానిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌,ఆగస్టు11 (ఆంధ్రజ్యో తి) : కరీంనగర్‌ జిల్లా చొప్పదండి లో ఈనెల 8, 9, 10వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో కొల్లాపూర్‌ మండలానికి చెందిన తైక్వాండో కింగ్స్‌ క్లబ్‌ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. వివిధ కేటగిరీలలో గోల్డ్‌, సిల్వర్‌, బ్రౌంజ్‌మెడల్స్‌ సా ధించి, అక్టోబరు 2, 3, 4వ తేదీలలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మం గళవారం కొల్లాపూర్‌ పట్టణంలోని తన క్యాం పు కార్యాలయం వద్ద సన్మానించారు. బల్స్‌ అఖిలేష్‌ యాదవ్‌ గోల్డ్‌ మెడల్‌ మధ్యమోని ఆదిత్య యాదవ్‌ సిల్వర్‌ మెడల్‌, అభిరామ్‌ సి ల్వర్‌ మెడల్‌, విజయ్‌ ఆదిత్య యాదవ్‌, పాండు బ్రౌంజ్‌ మెడల్స్‌, భవ్య, దీక్షిత, ప్రవీణ్‌ సిల్వర్‌ మెడల్స్‌ శ్రీజ, ప్రవంతిక, మనీషా బ్రౌంజ్‌ మెడ ల్స్‌ వారిని సన్మానించారు.

జాతీయ స్థాయికి ఎంపికైన కొల్లాపూర్‌ కీర్తిని చాటిన విద్యార్థులను తెలంగాణ స్టేట్‌ అసోసి యేషన్‌ జనరల్‌ సెక్రటరీ శ్రీహరి మాస్టర్‌, జిల్లా సెక్రటరీ శేఖర్‌ మాస్టర్‌ కొల్లాపూ ర్‌ తైక్వాండో కింగ్స్‌ క్లబ్‌ సీనియర్‌ మాస్టర్‌ శరబంద రాజ్‌, కోచ్‌లు చెనమోని భాస్కర్‌ యాదవ్‌, ఉపేందర్‌, మల్లేష్‌ యాదవ్‌, రవీందర్‌, తాజుద్దీన్‌, శివకు మార్‌ యాదవ్‌లను మంత్రి అభినందించారు. క్రీడాకారులకు తన సహకారం ఎప్పుడూ ఉం టుందని మంత్రి భరోసా ఇచ్చారు.

Updated Date - Aug 11 , 2026 | 11:28 PM