పదేళ్లు బీసీలకు అన్యాయం చేశారు
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:26 AM
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు బీసీలకు అన్యాయం చేశారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు.
మాకింకా మూడేళ్ల టైముంది... మరో ఐదేళ్లు కూడా ఉంటాం
ప్రజలకు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటాం:దుద్దిళ్ల
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు బీసీలకు అన్యాయం చేశారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ వాకౌట్ చేయడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్నోవాలు సమకూర్చడమే పోలీస్ సంక్షేమమా అని ప్రశ్నించారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోంటే ఏమీ చేయడం లేదంటూ విమర్శించడం తగదన్నారు. ఆర్టీసీని బీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసిందని, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు వాళ్లతో మాట్లాడేందుకు ఒక్కరు కూడా వెళ్లలేదని చెప్పారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని శ్రీధర్ బాబు చెప్పారు. తమకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని, ఆ తర్వాత కూడా అధికారంలోకి రాబోయేది తామేనని, మొత్తంగా 8ఏళ్ల సమయం ఉందని, ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజ్యాంగ సవరణ చేసి, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.