అనుమతుల్లేని ఆయుష్ ఆస్పత్రులపై చర్యలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:24 AM
సరైన అనుమతులు, అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న ఆయుష్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
సంప్రదాయ వైద్యసేవలకు ప్రాచుర్యం: మంత్రి దామోదర
సరైన అనుమతులు, అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న ఆయుష్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆయుర్వేద, హోమియోపతి పేరిట ఆస్పత్రులు, క్లినిక్‌లు నడిపిస్తూ, తప్పుడు ప్రకటనలతో ప్రజలను దోచుకుంటున్న వారిని వదిలిపెట్టొద్దన్నారు. ఆయుష్ వైద్యసేవలపై నేచర్‌క్యూర్ ఆస్పత్రిలో మంత్రి రాజనర్సింహ బుధవారం సమీక్ష చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, కాలేజీలపై మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సిద్దిపేట, వికారాబాద్, భూపాలపల్లిలోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.