Minister Ponguleti Srinivas Reddy: ట్విట్టర్ టిల్లు కారుకూతలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:30 AM
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని బీఆర్‌ఎ్‌సపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని బీఆర్‌ఎ్‌సపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. పేదల కష్టాలను గత సర్కారు పట్టించుకోలేదని ఆరోపించారు. పాముకు కోరల్లోనే విషం ఉంటే.. ప్రతిపక్ష నేతలకు శరీరమంతా విషమేనన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ప్రధాన ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం, సీఎం, మంత్రులపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలే సెమీ ఫైనల్స్ అంటూ కారు కూతలు కూస్తున్న ట్విట్టర్ టిల్లుకు పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా చెంప చెళ్లుమనిపించేలా వారికి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. పేద వాడికి అండగా ఉంటూ, వారికి భద్రత, భరోసా కల్పించాలన్న తపనతోనే తమ సర్కారు కృషి చేస్తుందన్నారు.