Share News

మంత్రుల భేటీపై పిచ్చి రాతలు సరికాదు

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:13 AM

ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండటంతో.. మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కొందరు మంత్రులు నా దగ్గరకు వచ్చారు. ఆ విషయాలను నేను ముఖ్యమంత్రికి కూడా వివరించా...

మంత్రుల భేటీపై పిచ్చి రాతలు సరికాదు

  • సీఎం విదేశాల్లో ఉండటం వల్లే నా దగ్గరకొచ్చారు: భట్టి

మధిర, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండటంతో.. మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కొందరు మంత్రులు నా దగ్గరకు వచ్చారు. ఆ విషయాలను నేను ముఖ్యమంత్రికి కూడా వివరించా. కానీ దీనిపై కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారు. ఇది ఎంతమాత్రం వారికి తగదు. మంత్రులు.. డిప్యూటీ సీఎంను కాకుండా రాసే వారితోనో.. చూపించే వారితోనా కలుస్తారా?’ అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి టెండర్ల అంశంలో పూర్తి ఆధారాలతో తాను స్పష్టత ఇచ్చానని, ఇంకా అందులోనే తిరుగుతామంటే అది వారి ఖర్మ అని అన్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఎలా అయితే అత్యధిక స్థానాలు గెలిచామో అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ అధిక సంఖ్యలో స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Jan 29 , 2026 | 05:13 AM