Share News

పారదర్శకంగా బదిలీలు చేపట్టాలి

ABN , Publish Date - May 07 , 2026 | 05:14 AM

ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సంక్షేమ శాఖ పరిధిలో పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆదేశించారు.

పారదర్శకంగా బదిలీలు చేపట్టాలి

అధికారులను ఆదేశించిన మంత్రి అడ్లూరి

హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సంక్షేమ శాఖ పరిధిలో పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆదేశించారు. సచివాలయంలో టీజీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, ఆశ్రమ పాఠశాల లు, షెడ్యూల్‌ కులాల అభివృద్థి శాఖ, దివ్యాంగుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దూర ప్రాంతాల్లో దీర్ఘకాలం సవలందించిన ఉద్యోగులకు వారు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు, దంపతులు ఒకే చోట పనిచేేస ‘‘స్పౌజ్‌’’ వంటి అంశాలను సానుకూలంగా పరిగణించాలన్నారు. ప్రతి దశలో డిజిటల్‌ పద్ధతులను వినియోగించి మానవ జోక్యం తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గురుకులాల్లో అమలు చేసిన 370 జీవో కారణంగా ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 190 జీవో జారీ చేసినప్పటికీ అమలులో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ 190 జీవో అమలు సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించి అమలు చేేసలా కృషి చేయాలన్నారు.

Updated Date - May 07 , 2026 | 05:14 AM